భారీ వరదల నడుమ ఉత్తరాఖండ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ లో పలు ప్రాంతాలలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన వర్షాల కారణంగా చాలా మంది చనిపోయి, వారి శవాలను గుట్టలుగా చూడాల్సివస్తుంది. భారతీయ ప్రభుత్వం తక్షణం రక్షణ చర్యలు చేపట్టినా దాతలనుండి విరాళాలు కోరుకుంటుంది.
దేశంలో చాలా చోట్లనుండి ప్రజలు విరాళం అందించడం మొదలుపెట్టారు. ఇదే బాటలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ వరద భాదితులకు పవన్ కళ్యాణ్ 20 లక్షలు విరాళం అందజేశారు. మిగిలిన సినీ ప్రముఖులు కుడా ఇదే విధంగా స్పందించి ఈ మిలీనియంలో అత్యంత విషాదకరమైన సంఘటన కలిగించే భాదాకరమైన స్మృతులను కాస్త తగ్గించాలని కోరుకుందాం.