మానవత్వానికి, మానవతా హృదయానికి సినీ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరడుగుల నిలువత్తు నిదర్శనమని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో పలు ఉదాహరణలతో సహా తెలిపాడు. అటువంటి మరో సంఘటనకు ఖమ్మం వేదికైంది. పవన్ కళ్యాన్ ఖమ్మం నగర శివారులో ఉన్నటువంటి ‘జీసెస్ అనాధ వృద్ధాశ్రమానికి’ లక్ష రూపాయిల విరాళం ఇచ్చాడు. ఇటీవలే పవన్ కళ్యాన్ ను కలిసిన ఆశ్రమ నిర్వాహకురాలు ఎన్. లక్ష్మి ఆశ్రమంలో తాము నిర్వహిస్తున్న సేవలను వివరించగా మూడు రోజులక్రితం తమకు బ్యాంకు ద్వారా లక్ష రూపాయిల విరాళాన్ని పంపించారని తెలిపారు. ఇదేగాక ఉత్తరాఖండ్ వరద భాధితులకు సైతం పవన్ ముందుగా స్పందించిన విషయం తెలిసినదే. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కుడా చాలా మందికి హీరో అయ్యారు.