క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానికి పవన్ 5 లక్షలు సాయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఇంత అభిమానజనం అంటే దానిని సినిమాలే అనే సమాధానం కంటే కూడా అతని వ్యక్తిత్వం అనే సమాధానమే గట్టిగా వినిపిస్తుంది. సరైన సంపాదన లేని సమయంలోనే ఎప్పటి నుంచో ఎంతో మందికి ఆర్ధికంగా సాయం చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు.

ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన లింగాల గ్రామంలో తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న భార్గవ్ అనే యువ అభిమానికి తన చివరి కోరికగా పవన్ ను చూడాలని కోరాడు. ఆ వార్త మొత్తానికి పవన్ ను చేరి అక్కడి వరకు వెళ్లగలిగేలా చేసింది. నిన్న రాత్రే పవన్ భార్గవ్ వద్దకు చేరి పరామర్శించారు.

అంతే కాకుండా తన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులతో అన్ని కనుక్కున్నారు. అలాగే భార్గవ్ కుటుంబీకులతో కూడా మాట్లాడి వారికి ఆత్మస్థైర్యం చెప్పి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని భార్గవ్ చికిత్స కోసం ప్రకటించారు. దీనితో పవన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారని చెప్పాలి.

Exit mobile version