పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో పై అభిమానులు ఆనందం వ్య్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆడియో అవుట్ పుట్ పై చాలా సంతోషంగా ఉన్నారు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఫుల్ మాస్ ఆల్బం ఇచ్చాడు. గతంలో పవన్ కళ్యాణ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ పాటలను మరిపిస్తూ వచ్చిన ఈ ఆల్బం పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటున్నారంటే కార్తీక్ మాట్లాడుతూ పిల్లా సాంగ్ చాలా బావుందనీ పవన్ నుంచి ఎన్నో రోజులుగా మిస్సవుతున్న మాస్ బీట్స్ ఈ సినిమాతో తీరిపోయోందని అంటున్నాడు. మీడియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న రాజీవ్ మాట్లాడుతూ ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ సాంగ్ పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా సరిగ్గా సరిపోయిందని అంటున్నాడు.