పవన్, హరీష్ ల చిత్రం మామూలుగా ఉండదంటున్న దేవి.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్” సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. ఒక రీమేక్ అయ్యినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ మనకు తగ్గట్టుగా భారీ మార్పులు చేర్పులు చేసి చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ ను కొట్టారు. దీనితో ఈ కాంబో అంటే పవన్ అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.

మరి ఇదిలా ఉండగా ఆ కాంబో నుంచి మరో చిత్రం అనౌన్స్మెంట్ కూడా జరగడంతో భారీ అంచనాలు సెట్టయ్యాయి. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా మరింత ఆసక్తిని రేపింది. మరి ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే మామూలుగా ఉండదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అంటున్నారు.

ఈ కొత్త సంవత్సరం సందర్భంగా దర్శకుడు హరీష్ పవన్ ను కలవడానికి వెళ్లారు. దీనితో ఈ సినిమా టాక్ రాగా దేవి ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలోని హరీష్ చెప్పిన కొన్ని సీన్స్ మామూలుగా అనిపించలేదు అని థియేటర్స్ ఆ యుఫోరియా కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపారు. సో మళ్లీ పవన్ మరియు హరీష్ ల కాంబో నుంచి మరో సాలిడ్ సినిమా లోడ్ అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version