నా సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు : కృష్ణ వంశీ

నా సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు : కృష్ణ వంశీ

Published on Jul 29, 2012 12:32 PM IST


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఎప్పటికప్పుడు కొత్త రకమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారు. ఆయన ప్రస్తుతం నాని హీరోగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం గురించి కృష్ణ వంశీ మాట్లాడుతూ ‘ నా రాబోయే చిత్రానికి ‘పైసా’ అనేది సినిమా టైటిల్ అని అందరూ అంటున్నారు. పైసా అనేది ఈ చిత్ర టైటిల్ కాదు. ఇప్పటివరకు 70% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు, త్వరలోనే టైటిల్ ని తెలియజేస్తాం’ అని ఆయన అన్నారు.ఈ చిత్రం ద్వారా కేథరిన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు