ఓయ్ దర్శకుడి సినిమాలో సందీప్ కిషన్


ఓయ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ రంగ సినిమాలు డైరెక్ట్ చేయడం పక్కన పెట్టి పొగ సినిమాతో నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు. త్వరలో నిర్మాతగా మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా త్వరలో ఒక సినిమా నిర్మించబోతున్నాడు. 12-12-12వ తేదీన ఈ సినిమా ప్రారంభం కానుంది. సందీప్ కిషన్ ఇటీవలే రొటీన్ లవ్ స్టొరీ సినిమాలో నటించాడు. రాండమ్ థాట్స్ బ్యానర్ పై ఆనంద్ రంగ, శేషు రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బోస్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకి అచ్చు సంగీత దర్శకుడు.

Exit mobile version