ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కి ఓ రేంజ్ కిక్ ఇచ్చిన అవైటెడ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రేంజర్ థింగ్స్ లో ఫైనల్ సీజన్ తాలూకా 4 ఎపిసోడ్స్ రచ్చ చేస్తున్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ లానే మరో టాప్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అయ్యే సక్రేజీ అండ్ మ్యాడ్ వెబ్ సిరీస్ కి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
మరి ఆ సిరీస్ నే “ది బాయ్స్”. సూపర్ హీరోల జానర్లో తెరకెక్కిన ఈ సిరీస్ కూడా ఇప్పుడు ఫైనల్ బ్యాటిల్ కి వచ్చేసింది. దీనితో ఈ అవైటెడ్ సిరీస్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది అని చెప్పాలి. లేటెస్ట్ గా బిల్లి బుచర్ ఇంకా హోమ్ లాండర్ పై వదిలిన పోస్టర్స్ మంచి బజ్ ని క్రియేట్ చేయగా వాటితోనే ఇదే ఆఖరి సీజన్ అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సిరీస్ ఫ్యాన్స్ కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చింది అని చెప్పాలి.
Scorched earth.
Shock and awe.
Blood and bone. pic.twitter.com/zdAFQIoBN8— THE BOYS (@TheBoysTV) December 3, 2025
