నెట్ ఫ్లిక్స్ లో ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ కి సంచలన రెస్పాన్స్!

Stranger Things Season 5

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూసిన అవైటెడ్ వెబ్ సిరీస్ నే స్ట్రేంజర్ థింగ్స్ 5. సెన్సేషనల్ హైప్ నడుమ వచ్చిన ఈ 4 ఎపిసోడ్ల సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు సెట్ చేస్తున్నట్టు స్వయంగా సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఈ 4 ఎపిసోడ్ల సిరీస్ ఏకంగా 59.6 మిలియన్ వ్యూస్ ని ఈ వారంలో కొల్లగొట్టినట్టు నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు.

అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ హిస్టరీ లోనే ఏ ఇంగ్లీష్ సిరీస్ కి కూడా రాని రెస్పాన్స్ ఈ సిరీస్ కి వచ్చినట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 సంచలన రెస్పాన్స్ తో ఇప్పుడు దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక డఫెల్ బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ నెక్స్ట్ వాల్యూమ్ డిసెంబర్ లో విడుదల కానుంది. అలాగే ఫైనల్ ఎపిసోడ్ ని కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయబోతున్నారు.

Exit mobile version