ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 2, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : మయూర్ మోరె పలక్ జైస్వాల్, తిగ్మాన్షు ధులియా, దేవెన్ భోజాని తదితరులు
దర్శకుడు : పుష్కర్ సునీల్ మహాబల్
నిర్మాతలు : హేమల్ ఏ టక్కర్, స్వరూప్ సంపత్
సంగీతం : మేఘదీప్ బోసే
సినిమాటోగ్రఫీ : సాయి భోపే
ఎడిటర్ : పుష్కర్ సునీల్ మహాబల్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ క్రమలోనే తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
నాగ్‌పూర్‌లో జరిగిన సీరియల్ మర్డర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఓ కుర్రాడు, తను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని ఓ హోటల్‌కు వెళ్తాడు. అక్కడ చోటుచేసుకున్న ఘటన వల్ల ఆమె మృతదేహాన్ని తీసుకుని పారిపోతాడు. ఈ క్రమంలో మరికొంత మంది కూడా హత్యకు గురవుతారు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? ఈ హత్యలతో ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం ఉంది..? అతడు నిజంగానే ఈ హత్యలు చేశాడా..? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
క్రైమ్ థ్రిల్లర్‌ను డాక్యుమెంటరీ స్టైల్‌తో తెరకెక్కించడం ఈ వెబ్ సిరీస్‌కు మేజర్ అసెట్ అని చెప్పాలి. ఓ క్రైమ్ జరిగినప్పుడు విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కల్ప్రిట్ పాయింట్ ఆఫ్ వ్యూ ని మాత్రమే పరిగణిలోకి తీసుకుంటారు. కానీ ఈ వెబ్ సిరీస్‌లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూను కవర్ చేసిన విధానం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సాగడం బాగుంది.
సామాజిక ఒత్తిళ్ల వల్ల ఓ ప్రేమికుడు హంతకుడిగా ఎలా చూపించబడ్డాడో మనకు ఈ వెబ్ సిరీస్‌లో చక్కగా చూపెట్టారు. ప్రేమకథను క్రైమ్ మిక్స్ చేసి థ్రిల్లర్‌గా దర్శకుడు ఆడియన్స్‌ను ఎలా ఎంగేజింగ్ చేశాడనేది కూడా బాగుంది. కాగా, ఈ వెబ్ సిరీస్‌లో నటీనటులు తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు.
ఇంటెన్స్ స్క్రీన్ ప్లే తో ఈ వెబ్ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. మధ్యలో వచ్చే ట్విస్టులు, సోషల్ మెసేజ్‌లు ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా, దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుండాలి. అయితే, ఈ వెబ్ సిరీస్‌లో అది లోపించింది. కథను చాలా ఫ్లాట్‌గా తీసుకెళ్లినట్లుగా చాలాసార్లు అనిపిస్తుంది.
ముఖ్యంగా స్లో పేస్ ఈ వెబ్ సిరీస్‌కు పెద్ద డ్యామేజ్ చేసిందని చెప్పాలి. కొన్ని ఎపిసోడ్స్ చాలా లెంగ్తీగా అనిపిస్తాయి. అటు సంగీతం పరంగా కూడా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడం మైనస్. నటీనటుల పర్ఫార్మెన్స్‌లు బాగున్నా, వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత దక్కలేదని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. మరికొన్ని పాత్రలు మధ్యలోనే ముగించినట్లు అనిపిస్తాయి.
ఇక డాక్యుమెంటరీ స్టైల్ థ్రిల్లర్‌కు ఎంగేజింగ్ ట్విస్టులు అవసరం ఉంటాయి. ఒకట్రెండు మినహా మనకు ఈ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు పెద్దగా ఎక్కవు. ప్రేమకథను ఇంకాస్త డిఫరెంట్‌గా డీల్ చేసి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే పై పెట్టిన ఫోకస్ టేకింగ్‌పై కూడా పెట్టి ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు పుష్కర్ సునీల్ మహాబల్ ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా, దానిని ఆయన వైవిధ్యంగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించాడు. డాక్యుమెంటరీ స్టైల్‌లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్‌ను ఆయన డీల్ చేయాలనుకున్న ప్రయత్నం బాగుంది. అయితే స్క్రీన్ ప్లే వర్క్ బాగున్నా, ఎడిటింగ్ విషయంలో ఆయన ఇంకా బెటర్‌గా చూపించాల్సింది. సాయి భోపే సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విజువల్‌గా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. మేఘదీప్ బోసే సంగీతం కూడా ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘బ్లాక్ వైట్ & గ్రే’లో ఒక నిజాన్ని ఇలాంటి కోణంలో కూడా చూపించవచ్చా.. అనే పాయింట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అయితే, ఈ వెబ్ సిరీస్‌లోని స్లో పేస్, రొటీన్ ప్లాట్, పెద్దగా ఆకట్టుకోని ట్విస్టులు ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ కొంతవరకు నచ్చుతుంది. అయితే, మిగతా ఆడియన్స్ మాత్రం ఈ వీకెండ్ వేరొక ఎంటర్‌టైనింగ్ ఆప్షన్ చూసుకోవడం బెటర్.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team