ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటించిన ‘ఒంగోలు గిత్త’ సినిమా ఈ వారం అనగా ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో సెన్సార్ వారు సినిమాకి ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ కి జంటగా కృతి కర్బంధ నటించింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపధ్యంలో తెరకెక్కింది. జి.వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఓ పాటను కూడా కంపోజ్ చేసారు.