కళ్యాణ్ రామ్ తాజా 3డి సినిమా ‘ఓం’ మరోసారి వాయిదాపడింది. సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 19న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కుడా ముగిసాయి. ఆడియో కుడా విడుదలైన ఈ సినిమాను ఒంటరిగా బరిలోకి దించాలని చిత్ర బృందం యోచిస్తున్నారట. ఈ వాయిదాకు అది కూడా ఒక కారణం అయ్యింది. సూర్య ‘సింగం’ జూలై 5న, గోపీచంద్ ‘సాహసం’ జూలై 12న విడుదలకావడంతో ‘ఓం’ సినిమా 19న విడుదల కావడానికి సిద్ధపడుతుంది. ఈ సినిమాలో కృతి కర్బంధ, నికీషా పటేల్ హీరోయిన్స్. డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ సునీల్ రెడ్డి ఈ సినేమాకుగాను పలువురు హాలీవుడ్ నిపుణులను పెట్టుకున్నాడు. అతి తక్కువ వ్యవధిలో తెలుగులో విడుదల కాబోతున్న రెండో 3డి సినిమా కావడంతో అత్యున్నత టెక్నాలజీని వినియోగిస్తేగనుక ఈ సినిమా ప్రేక్షకులకు కనులపండుగ కావడం ఖాయం