‘సోలో’ సినిమాతో తొలి హిట్ ఖాతాలో వేసుకున్న నారా రోహిత్ హీరోగా రానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒక్కడినే’ విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదలని డిసెంబర్ 14కి వాయిదా వేసారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. నారా రోహిత్ సరసన మళయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ‘కథ’ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రాగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గులాబి మూవీస్ బ్యానర్ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సింగర్ కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో నాగబాబు, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ మరియు అలీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.