పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఓజి కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ చిత్రంగా ఈ మూవీ అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే తెరుచుకున్నాయి.
అయితే, అమెరికాలో పవన్ కళ్యాణ్ ఊచకోత అప్పుడే మొదలైంది. సినిమా రిలీజ్‌కు ఇంకా పదిహేను రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్ రూపంలో నార్త్ అమెరికాలో ఏకంగా 1.5 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ భరతం పట్టడం ఖాయమని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.