పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారి భారీ మైలురాయిని అందుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్లింది. ఈ విజయాన్ని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓవర్సీస్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్లో విలన్‌గా ఎంట్రీ ఇవ్వగా, హీరోయిన్ ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది.
డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.