బిగ్ సర్ప్రైజ్: ‘గ్లోబ్ ట్రాటర్’ నుంచి వచ్చే ట్రీట్ రివీల్ చేసేసిన రాజమౌళి!

ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ కాంబినేషన్ ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమా కోసమే అని చెప్పాలి. ఈ సినిమా తాలూకా భారీ ఈవెంట్ ని నేడు చేస్తుండగా ఈ ఈవెంట్ లో అసలు ఏం రివీల్ చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ ఈవెంట్ లో తాము చేయనున్న మ్యాజిక్ కోసం జక్కన్న ఇప్పుడు సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చేసారు.

దీంతో తాము ఓ గ్రాండ్ విజువల్ వరల్డ్ తో గ్లోబ్ ట్రాటర్ ట్రైలర్ ని తాము రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే అక్కడ పెద్ద తెరపై పడిన తర్వాతే ఆ విజువల్ ట్రీట్ ని ఆన్ లైన్ లో అఫీషియల్ గా వదులుతామని తెలిపారు. సో అభిమానులకి ప్రపంచ ఆడియెన్స్ ని నేడు ఏం రాబోతుంది అనేది ఇప్పుడు రివీల్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. మరి జక్కన్న ఇచ్చే ఈ భారీ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version