రెండు రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెకండ్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో ఇచ్చిన ‘జాబిల్లి నువ్వే’ అనే పాట అందరినోటా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ టీజర్ ని 6 లక్షల 47 వేల మంది చూసారు.
ఎన్.టి.ఆర్ డాన్స్, సమంత ఎక్స్ ప్రెషన్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ స్పెయిన్ లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
ఆ వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి