ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన ఎన్.టి.ఆర్

ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన ఎన్.టి.ఆర్

Published on Jul 31, 2012 10:38 AM IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన ఫిట్నెస్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన రాబోయే చిత్రం ‘బాద్షా’ లో సరికొత్తగా కనిపించాలని ఎన్.టి.ఆర్ తన ఫిట్నెస్ మీద ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అందులో భాగంగానే తన పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ ని తనతో పాటు ఓవర్సీస్ షెడ్యూల్స్ కి కూడా తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా అబ్రాడ్ లో పూర్తి సౌకర్యాలతో కూడిన జిమ్ ఉండే హోటళ్ళలో తనకి బస ఏర్పాటు చెయ్యాలని నిర్మాతలను కోరారు. ఎన్.టి.ఆర్ గతంలో ఎప్పుడూ తన ఫిట్ నెస్ గురించి అంతగా పట్టించుకోలేదు. డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘బాద్షా’ చిత్రంలో సరికొత్త లుక్ మరియు స్టైలిష్ గా ఎన్.టి.ఆర్ కనిపించనున్నారు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర టీం రెండవ షెడ్యూల్ కోసం త్వరలోనే బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు