మీరు నా ఫిలాసఫర్- ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సంధర్భంగా ఓ భావోద్వేగ సందేశం సోషల్ మీడియాలో పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ కి తన జీవితంలో ఉన్న స్థానం ఏమిటో తెలియజేశాడు. కళ్యాణ్ రామ్ కి బర్త్ డే విశెష్ చెవుతూ..”అన్నకు మించి మీరు నా ఫ్రెండ్, ఫిలాసఫర్ మరియు గైడ్. హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ అన్నయ్య. మీకు సాటిలేరు’ అని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రంతో చేస్తుండగా…ఆ మూవీ నిర్మాణ భాగస్వామిగా కళ్యాణ్ రామ్ ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఆ మూవీ మంచి విజయం అందుకుంది.

Exit mobile version