యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఎన్.టి. ఆర్, శృతి హసన్ పాల్గొంటున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ ఒక ముఖ్యమైన, ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకానుంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ ఫుల్ గా, స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతాడని ఆ డైలాగ్స్ ని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఇంకొద్ది రోజులు వేచివుండాలని హరీష్ శంకర్ అన్నాడు. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.