యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ సినిమాతో ఎన్.టి.ఆర్ ని క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అందులో ఒకరిగా సమంత ఇప్పటికే ఎంపిక కాగా, సెకండ్ హీరోయిన్ గా రెజీనాని పరిశీలిస్తున్నారు, అది ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ నుంచి ఒక సూపర్బ్ ట్యూన్ కొట్టించుకున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.