తమ క్లోజ్ ఫెండ్స్ ఎవరో చెప్పిన ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్

ntr-charan
ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ ప్రముఖ పత్రికకి తమ స్నేహితుల గురించి చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..

ఎన్.టి.ఆర్ చెబుతూ ‘ స్నేహం అనేది మాటల్లో చెప్పలేని అలాగే ఎంతో విలువైనది. స్నేహం అనేది ఎలాంటి స్వార్ధం లేని బంధం. దేవుడు మనకు ఫ్యామిలీని ఇస్తాడు కానీ స్నేహితులని మనమే సంపాదించుకోవాలి. ఒకసారి స్నేహ బంధం మొదలైతే అది చనిపోయే వరకు మనల్ని వీడి వెళ్ళదు. స్నేహల్, కార్తీక్, లవ్ రాజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. వారిలో స్నేహల్ అమెరికాలో ఉంటాడు, మిగతా ఇద్దరు లోకల్లోనే ఉంటారు. వాళ్ళు నా సినిమాలు చూస్తారు, చూసి ఎంతో నిక్కచ్చిగా ఉండే ఫీడ్ బ్యాక్ ఇస్తారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని’ అన్నాడు.

రామ్ చరణ్ తన ఫ్రెండ్ షిప్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ‘ మా నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాతే ఎవరన్నా వస్తారు. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాము, నాన్న నాకు ఫుల్ ఫ్రీడం ఇస్తారు. నాన్నగారు నా సినిమాల గురించి, కెరీర్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. ఆయన హీరోగా ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండేవారు ఎక్కువ టైం గడపడానికి వీలయ్యేది కాదు. పొలిటీషియన్ గా మారిన తరవాత ఆయన ఇంకా బిజీ అయిపోయారు. కానీ మాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఇంట్లో హ్యాపీ గా గడుపుతాము. ఇండస్ట్రీలో అయితే రానా నాకు మంచి ఫ్రెండ్. నాకు చిన్నప్పటి నుంచి తను తెలుసని’ రామ్ చరణ్ చెప్పాడు.

Exit mobile version