ఇక రామ్ చరణే మిగిలి ఉన్నాడు.!

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే పీరియాడిక్ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చరణ్ తో పాటు మన టాలీవుడ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే చరణ్ మాత్రం తన ఫ్యూచర్ సినిమాల పట్ల మాత్రం ఏమంత తొందర చూపడం లేదట.

ఎందుకంటే ఇప్పటికే తారక్ రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేసారు. అలాగే డార్లింగ్ హీరో ప్రభాస్ కూడా మూడు సినిమాలను హోల్డ్ లో ఉంచాడు. అలాగే అల్లు అర్జున్ చేతిలో కూడా రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. కానీ రామ్ చరణ్ మాత్రం హీరోగా ఈ ఒక్క సినిమా తప్ప మరో సినిమా కమిట్ అయ్యినట్టు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

దీనికి కారణం చరణ్ తొందర పడకుండా స్క్రిప్ట్స్ వినే పనిలో ఉన్నారని మంచి కథలు దొరికితే అప్పుడు చరణ్ ఒక సినిమా కమిట్ అవ్వనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏది అన్నది కన్ఫర్మ్ కాలేదు, మరి చరణ్ ఎవరితో సినిమాలు చేస్తారో చూడాలి.

Exit mobile version