‘ఖలేజా’ మేనియా కాదు కానీ అత(డు)డొస్తున్నాడు.. రీరిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన క్రేజీ కల్ట్ క్లాసిక్ చిత్రం ఖలేజా సినిమా ఇపుడు రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ ని అందుకొని దుమ్ము లేపుతుంది. మరి ఈ సినిమాని తెరకెక్కించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేసిన మొదటి సినిమా ‘అతడు’ రీరిలీజ్ పట్ల కూడా భారీ హైప్ ఎప్పుడు నుంచో ఉంది.

మరి ఈ ఖలేజా మేనియా కొనసాగుతున్న సమయంలోనే ఇపుడు అతడు డేట్ కూడా అధికారికంగా వచ్చేసింది. మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 9 నుంచి సినిమా రీరిలీజ్ కి వస్తున్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది. నేడు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కానుకగా ఈ సాలిడ్ అప్డేట్ రివీల్ అయ్యింది. సో మొత్తానికి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు అతడొస్తున్నదని చెప్పాలి.

Exit mobile version