తెలుగునాట మరో సౌందర్యగా పేరు తెచ్చుకున్న నిత్యమీనన్ తన కో-స్టార్ నితిన్ తో కలిసి రెండు వరుస విజయాలను అందుకుంది. వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె కధను, కధలో తన పాత్రను అర్ధంచేసుకుని, తనకు నచ్చాకే సినిమాను అంగీకరిస్తుంది. అందుకనే ఏకకాలంలో ఒక సినిమాకంటే ఎక్కువ నటించడంలేదు. ఈ విషయాన్ని నిత్య పలు సందర్భాలలో ధృవీకరించింది. సినిమా కధ నచ్చితే భాషతో పట్టింపులేకుండా నటిస్తానంటుంది. ప్రస్తుతం దక్షిణాదిన భారీ నిర్మాణ ప్రాజెక్ట్స్ లలో పనిచేస్తుంది.
ఈమధ్యే ఆమె నటించిన రెండు మళయాళ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలయ్యాయి. మరో మళయాళ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ ఈ ఏడాదిలో విడుదలకానుంది