హైదరాబాద్ కొత్త షెడ్యూల్లో కొరియర్ బాయ్ కళ్యాణ్

COURIER-BOY-KALYAN-2
నితిన్, యామి గౌతం జంటగా నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ షూటింగ్ హైదరాబాద్లో జరగనుంది. ఇటీవలే పాండిచెర్రి దగ్గర జరిపిన చిత్రీకరణతో టాకీ భాగం దాదాపుగా పూర్తయింది. ఈ వారంలో హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్లో నితిన్, యామీ ల నడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను ప్రేమ్ సాయి తీస్తున్నాడు. ఫోటాన్ కథాస్ బ్యానర్ పై గౌతం మీనన్ నిర్మిస్తున్నాడు. రెండు భారీ విజయాలతరువాత నితిన్ ఒక కామెడి థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి రొమాంటిక్ కామెడి తరహా థ్రిల్లర్ తెలుగులో ఇదే మొదటిసారి అని చెప్పాడు. కొరియర్ బాయ్ గా నితిన్, సేల్స్ గర్ల్ గా యామి గౌతం కనపడనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

Exit mobile version