నితిన్ సరికొత్త సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘ఏమైందో ఏమో’ పాటను చిత్రీకరించి, దాని అవుట్ పుట్ చాలా బాగుందని తెలిపారు. కాస్త సందిగ్ధత తరువాత సినిమా నిర్మాతలు ఈ సినిమా ఆడియో లాంచ్ ని ఈ నెల 27న హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో భారీ రీతిలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు.
నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ముఖ్య పాత్రధారులు. విజయ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతంఅందించాడు . ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ‘హైట్స్ ఆఫ్ లవ్’ అనర్ది ఈ సినిమా ఉపశీర్షిక. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఏప్రిల్ 19న మన ముందుకు రావచ్చని అంచనా.