నితిన్ నటిస్తున్న ‘హార్ట్ అటాక్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 30నుండి మొదలుకానుంది. పూరి జగన్నాధ్ దర్శకుడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ గచ్చిబౌలి సమీపంలో వున్న అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద మొదలుకానుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నితిన్ పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా వుండనుండి. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ విభాగాన్ని ఎస్. ఆర్ శేఖర్ చూసుకుంటారు
ఈ ‘హార్ట్ అటాక్’ పూరి మరియు నితిన్ లకు చాలా ముఖ్యమైన సినిమా. అధా శర్మ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపిస్తుంది