పోరాట సన్నివేశంతో మొదలైన పూరి – నితిన్ ల సినిమా

పోరాట సన్నివేశంతో మొదలైన పూరి – నితిన్ ల సినిమా

Published on Aug 30, 2013 8:00 PM IST

Puri-Nithin
పంచ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో నితిన్ తమ తదుపరి సినిమా ‘హార్ట్ అటాక్’ ను ఈరోజు హైదరాబాద్ లో గచ్చిబౌలి దగ్గర అల్ల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర మొదటి షెడ్యూల్ తో ప్రారంభించారు. పూరి తన పాత స్టైల్లోకి వెళ్లి క్లైమాక్స్ లో జరిగే ఒక పోరాట దృశ్యాన్ని మొదట చిత్రీకరించారు.

అధా శర్మ ఈ సినిమాలో ఒక హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలను ఎస్.ఆర్ శేఖర్ చేపట్టారు. ఈ సినిమాను పూరి జగన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పురియే స్వయంగా నిర్మిస్తున్నాడు

‘హార్ట్ అటాక్’ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగుతుందని అంచనా. నితిన్ పాత్ర చిత్రీకరణలో కావలసినంత హీరోయిజం వుంటుందని సన్నిహితవర్గాల సమాచారం

తాజా వార్తలు