తూర్పు గోదావరి జిల్లాలో 39 లక్షలు వసూలు చేసిన “నిప్పు”


రవితేజ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్ర్హలావు నటించిన చిత్రం “నిప్పు” ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. గతంలో మేము ప్రచురించిన విధంగా ఈ చిత్రం తూర్పు గోదారి జిలాలో 75 లక్షలు వసూలు చేస్తుంది అన్నాము కాని ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం విడుదలయిన నాలుగు రోజులకి 35 లక్షలు వసూలు చేసి అటు వైపు పరిగేతేలా కనిపించింది కాని విడుదల అయిన రోజు నుండి ఈరోజు వరకు ఈ చిత్రం 39 లక్షలే వసూలు చేసింది సిని పండితుల అంచనా ప్రకారం మరో 3 నుండి 4 లక్షలు వసూలు చెయ్యవచ్చు. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వై వి ఎస్ చౌదరి నిర్మించారు.

Exit mobile version