ఎన్.టి.ఆర్ స్టెప్స్ కి ఫిదా అయిన హరీష్ శంకర్

ఎన్.టి.ఆర్ స్టెప్స్ కి ఫిదా అయిన హరీష్ శంకర్

Published on Sep 5, 2013 1:21 PM IST

Harish-Shankar-and-Jr-Ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు షూటింగ్ లో ఎన్.టి.ఆర్ టాలెంట్ చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చిన హరీష్ శంకర్ తాజాగా ఎన్.టి.ఆర్ వేస్తున్న స్టెప్స్ చూసి ఫిదా అయిపోయి ఎన్.టి.ఆర్ పై ప్రశంశల జల్లు కురిపించాడు.

‘యంగ్ టైగర్ వేస్తున్న డాన్సులకు సెట్లో ఉన్న అందరూ క్లాప్స్ కొట్టారు. ఎన్.టి.ఆర్ ఎనర్జీ సూపర్, శేఖర్ మాస్టర్ కి థాంక్స్. ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు ఎడిటింగ్ చేస్తారా అని చూస్తున్నాను. ఈ సాంగ్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. అలాగే ఎన్.టి.ఆర్ – సమంతల కెమిస్ట్రీ సింప్లీ సూపర్బ్.. ఎవరన్నా ఒక సాంగ్ లో సర్ప్రైజ్ ఇవ్వొచ్చు లేదా ఒక రోజు సర్ప్రైజ్ ఇవ్వొచ్చు కానీ యంగ్ టైగర్ ప్రతి రోజూ తన స్టెప్స్ తో సర్ప్రైజ్ ఇస్తే ఏమనాలి?’ అంటూ హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఎన్.టి.ఆర్ స్టెప్స్ కి ప్రశంశల జల్లు కురిపించాడు.

శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు