విడాకులు తీసుకున్న మమతా మోహన్ దాస్

Mamatha-Mohandas
‘రాఖీ రాఖీ’ అంటూ, ‘ఆకలేస్తే అన్నం పెడతా’ అంటూ, ’36-24-36′ అంటూ ఊపున్న పాటలు పాడి మొదట సింగర్ గా తెలుగు వారికి పరిచయమయిన మలయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ ఆ తర్వాత నటిగా కూడా ‘యమ దొంగ’, ‘కేడి’, ‘కృష్ణార్జున’ తదితర సినిమాల్లో నటించింది. మమతా మోహన్ దాస్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన ప్రజిత్ పద్మనాభన్ అనే బిజినెస్ మాన్ ని 2011 డిసెంబర్ 28న పెళ్లి చేసుకుంది.

అలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వీరి వివాహ బంధం పట్టుమని రెండు సంవత్సరాలు కూడా నిలబడలేదు. గత కొద్ది రోజులుగా విడి విడిగా ఉంటున్న వీళ్ళు ఈ సంవత్సరం జనవరిలో విడాకులకు అప్లై చేసారు. ఆగష్టు 19న వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Exit mobile version