దర్శకుడు వాసు ఆంగ్ల చిత్రం తియ్యనున్నాడా?

P-Vasu
‘చంద్రముఖి’, ‘నాగవల్లి’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు పి.వాసు త్వరలో ఒక ఆంగ్ల చిత్రాన్ని తియ్యబోతున్నట్లు సమాచారం. ‘కర్రీ ఇన్ లవ్’ అనేది ఈ సినిమా యొక్క టైటిల్. ఈ సినిమానిర్మాణానికై హాలీవుడ్ కు చెందినా ఒక నిర్మాణ సంస్థ ఇప్పటికే వాసుతో చర్చలు సాగించింది. ఈ సినిమాలో అమెరికాకు చెందిన అమంతా సేఫ్రిడ్, నిక్ నోల్టే నటిస్తారు. అనీల్ కపూర్ సొనమ్ కపూర్ లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆగష్టు నుండి చిత్రీకరణ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version