నవదీప్, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ళ ఈ సినిమాకు దర్శకుడు. సునీత తాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా యొక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాడు . సంక్రాంతి నేపధ్యంలో సాగే సినిమా. కోడి పుంజు అపహరణ , పేకాట, దొంగతనాలు మరియు సినిమా ఆడిషన్స్ వంటి మూడు విభిన్న కధలలో ఈ సినిమా సాగుతుంది. ఒకదానితో మరొకటి సంబంధం లేకపోయినా వాటిని కలిపినా విధానం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు . మహేష్ శంకర్ సంగీతం అందించారు