మన తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా కనపడటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘అంతకు ముందు.. ఆ తరువాత’ సినిమా ద్వారా అచ్చతెలుగు అమ్మాయి ఇషా హీరోయిన్ గా పరిచయం కానుంది. అసలు ఈ భామకి ఈ అవకాశం ఎలా వచ్చింది అని అడిగితే ‘ నాకు మొదటి నుంచి గ్లామర్ రంగం అంటే ఇష్టం. అందుకే మోడల్ అయ్యాను. నేను నా పేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన నా స్టిల్స్ ని చూసి ఇంద్రగంటి గారు ఫోన్ చేసి పిలిపించారు. రెండు వారాలు టెస్ట్ షూట్, రెండు నెలలు వర్క్ షాప్ చేసిన తర్వాత ఈ సినిమాకి నన్ను ఫైనలైజ్ చేసారని’ ఇషా చెప్పింది.
విమర్శకుల మెప్పుపొందే ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ‘అలా మొదలైంది’ చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్ ఈ సినిమా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా అని అంటున్నారు.