అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !

Peddi Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇలాంటి ‘పెద్ది’లో ఆఫర్ వదులుకున్నట్లు తాజాగా మలయాళ నటి స్వాసిక తెలిపారు. అందుకు కారణం తల్లి పాత్ర కావడమే అని ఆమె తెలిపారు. ఈ సమయంలో రామ్ చరణ్‌కు మదర్ రోల్‌లో నటించేందుకు తాను సిద్ధంగా లేనని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ తరహా పాత్రలు వస్తే చేస్తానేమో అని స్వాసిక చెప్పుకొచ్చింది. కాగా ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అన్నట్టు గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27వ తేదీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version