చైతు హీరోయిన్ల లిస్ట్ లో కొత్త పేరు !

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీకి గొప్ప సినిమా ఇచ్చాడు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అంటూ అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఈ రోజు ‘థాంక్ యు’ అనే సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేను తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రష్మిక మండన్నాను ఫైనల్ చేశారు అన్నారు. ఇప్పుడు తాజాగా కృతి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేసారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

సంక్రాంతి అనంతరం మేకర్స్ ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి పి.సి శ్రీరామ్ కెమెరావర్క్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. దిల్ రాజు తన బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్నారు. అలాగే చైతు జాబితాలో నెక్స్ట్ విక్రమ్ కె కుమార్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వెంకీ అట్లూరి ఉన్నారు.

Exit mobile version