‘అఖండ 2’ 3డి క్వాలిటీ పై కొత్త అప్ డేట్ !

‘అఖండ 2’ 3డి క్వాలిటీ పై కొత్త అప్ డేట్ !

Published on Nov 17, 2025 8:00 AM IST

Akhanda2-m

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ చిత్రం 3డి ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 3డి విజువల్స్ ఎలా ఉంటాయి ?, నిజంగా 3డి క్వాలిటీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందా ?, మరోవైపు 3డి ఫార్మట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఐతే, ‘అఖండ 2’ 3డి ఫార్మట్‌ పై చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రతి షాట్ ను పర్ఫెక్ట్ గా చేశారట. అందుకోసం సరికొత్త టెక్నాలజీని కూడా వాడారని.. 3డీ క్వాలిటీ చాలా బాగుంటుందని తెలుస్తోంది. మరి ఈ 3డి విజువల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రెండ్‌ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు