మన టాలీవుడ్ లో ఎన్నెన్నో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. సినిమా చిన్నదో పెద్దదో, చెడ్డదో గొప్పదో ఓ నిర్మాణ సంస్థ దాన్ని స్థాపించిన నిర్మాత లేరు అంటే అది సాధ్యం కాదు. అలా ఇప్పుడు లేటెస్ట్ గా కూడా పలు నిర్మాణ సంస్థలు మన టాలీవుడ్ లోకి వచ్చాయి. అలాంటి వాటిలో టాలెంటెడ్ హీరో నాగశౌర్య తో “ఛలో”, “అశ్వథ్థామ” లాంటి చిత్రాలను నిర్మించిన బ్యానర్ “ఐరా క్రియేషన్స్” బ్యానర్ ఒకటి.
అయితే ఇప్పుడు వీరి అనుబంధ బ్యానర్ గా సోదరీమణి సంస్థ “ఐరా సినిమా” బ్యానర్ ను నూతనంగా పరిచ్చయం చెయ్యడమే కాకుండా ఆ బ్యానర్ లో ఒక సరికొత్త సినిమాను కూడా మొదలు పెట్టినట్టుగా తెలిపారు. వీరు తమ బ్యానర్ ద్వారా నూతన నటులు అలాగే టాలెంటెడ్ దర్శకుల ప్రతిభను చాటుకోవాలన్న తపన ఉన్నవారి కోసం ఈ బ్యానర్ ను స్థాపించారు.
ఇక వీరి మొట్టమొదటి సినిమా విషయానికి వస్తే ఈరోజు హైదరాబద్ లో పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది. ఇక అలాగే ఈ చిత్రాన్ని సన్నీ కోమలపాటి దర్శకత్వం వహించనుండగా అభినవ్ సర్దార్ సహా నిర్మాతగా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత ఉషా శంకర్ ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ ఐరా సినిమాస్, ఐరా ప్రొడక్షన్స్ కు సిస్టర్ నిర్మాణ సంస్థ అని దీని ద్వారా యువ టాలెంట్ ను ముందు తీసుకువరావాలనుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ అందివ్వడమే మా లక్ష్యం అని అన్నారు. అలాగే తాము చేస్తున్న ఈ మొదటి చిత్రం ఒక థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని అనౌన్స్ చేసారు.