ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 10, 2025
స్ట్రీమింగ్ వేదిక : నెట్‌ఫ్లిక్స్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : మథియాస్ ష్వీఘ్ఫెర్, రూబీ ఓ. ఫీ, ఫ్రెడరిక్ లౌ, సల్బెర్ లీ విలియమ్స్, మురతన్ ముస్లు, సిరా-అన్నా ఫాల్
దర్శకుడు : ఫిలిప్ కోచ్
నిర్మాతలు : ఫిలిప్ కోచ్, క్విరిన్ బెర్గ్, కాట్రిన్ గోటర్
సినిమాటోగ్రఫీ : అలెగ్జాండర్ ఫిషర్‌కోసెన్
సంగీతం : అన్నా ద్రుబిచ్, మార్టినా ఐసెన్‌రిచ్, మైఖేల్ కాడెల్‌బాచ్
ఎడిటింగ్ : హన్స్ హార్న్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన పలు చిత్రాల్లో జర్మన్ థ్రిల్లర్ చిత్రం ‘బ్రిక్’ కూడా ఒకటి. ఒక థ్రిల్లింగ్ ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఇండియాలో టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక గేమర్ అయినటువంటి ఆంటోన్ (మాథియాస్ ష్వీగోఫర్) తన భార్య ఒలీవియా (రూబీ ఓ ఫీ) లు కలిసి ఒక అపార్ట్మెంట్ లో తమ లైఫ్ లీడ్ చేస్తారు. తమకి పుట్టబోయే బిడ్డ విషయంలో జరిగిన విషాదం నుంచి బయటకి రావాలని ఇద్దరూ ప్రయత్నిస్తారు. ఇలా ఓ రోజు గొడవ తర్వాత ఒలీవియా ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ కట్ చేస్తే తమ ఇంటి చుట్టూ కనీసం డ్రిల్లింగ్ మిషన్ తో చిన్న రంద్రం కూడా పెట్టలేని గట్టి గోడ ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఇంటర్నెట్ పని చెయ్యదు, నీళ్లు రావు. మరి ఇలాంటి పరిస్థితి వారికే అనుకుంటే ఇంకా అదే అపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు. అసలు ఆ వింత ఇటుకలతో కూడిన గోడ ఎలా ఏర్పడింది? అందుకు కారణం ఏంటి? వారంతా బయట పడ్డారా లేదా అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
మొట్ట మొదటిగా ఈ సినిమాని ఆడియెన్ ఎందుకు చూడాలి అనేందుకు ప్రేరేపించే మొదటి పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అసలు ఏ సాధనంతో కూడా కూల్చలేని ‘డిఫెన్స్ మెజర్ సూపర్ అల్ట్రా హై టెక్’ గోడ నుంచి ఒక ఫ్యామిలీ ఎలా బయట పడ్డారు అనే ట్రైలర్ తోనే మంచి ఆసక్తి కలిగిస్తుంది.
ఇలా ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ గా ఇందులో కొన్ని కొన్ని మూమెంట్స్ కొంచెం ఆసక్తి కలిగిస్తాయి. అసలు ఆ గోడ తాలూకా స్పెషాలిటీ ఎందుకు దానిని ఆ సిటీ వారు ప్లాన్ చేసుకున్నారు లాంటివి బాగానే ఉన్నాయి. అలాగే నటీనటులు కూడా లిమిటెడ్ గానే ఉన్నారు. మాథియాస్ ష్వీగోఫర్ బాగా చేశారు.
రూబీ అందంగా ఉంది. అంతే రీతిలో పెర్ఫామెన్స్ కూడా బాగా చేసింది. వీరితో పాటుగా సాల్బర్ లీ, ఫెడెరిక్ లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే నెగిటివ్ పాత్రలో మారథాన్ ముస్లు బాగా చేసాడు. అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు వరకు చాలానే సినిమాలు సిరీస్ లు కూడా వచ్చాయి. ఈ సినిమాకి కూడా మంచి థ్రిల్లర్ గా నిలిచే ఛాన్స్ ఉంది కానీ మంచి పాయింట్ ని వీక్ కథనంతో మేకర్స్ డిజప్పాయింట్ చేసారని చెప్పక తప్పదు. కొన్ని కొన్ని సినిమాలకి ట్రైలర్స్ చూసి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చూసి మోసపోయిన సందర్భాలు చాలా ఉంటాయి.
అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. అలా నెట్ ఫ్లిక్స్ లో రాండమ్ గా ఈ సినిమా ట్రైలర్ ప్లే అయ్యి చూసి మొత్తం చూడాలి అనికుంటే వారికి నిరాశే మిగులుతుంది. ఈ తరహా కాన్సెప్ట్ లకి మంచి గ్రిప్పింగ్ అండ్ కొత్తదైన సీక్వెన్స్ లు డిజైన్ చేసుకుంటే బాగుంటుంది.
కానీ ఇందులో మాత్రం కాన్సెప్ట్ తప్ప మిగతా కథనం అంతా రొటీన్ థ్రిల్లర్స్ తరహాలోనే ఉంటుంది. అలాగే అనుకున్న కాన్సెప్ట్ ని సినిమాలో ఇంప్లిమెంట్ చేయడంలో కూడా దోషాలు ఉన్నాయి.
ఒక ఇంటి కోసమో లేదో ఒక సిటీ అనో కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచింది అధునాతన రక్షణ కవచాన్ని రెడీ చేసుకున్నారు బాగానే ఉంది కానీ దానిని ఎందుకు అప్పుడే అమలు చేశారు అనేది సరిగ్గా లేదు. అంతకు ముందు టైం లో కూడా చేసి ఉండొచ్చు కదా? ఇంతే కాకుండా విలన్ రోల్ కి ఈ సినిమా కాన్సెప్ట్ కి కూడా అంత పొంతన కనిపించలేదు. తన పాత్ర వీక్ అండ్ సిల్లీగా ఉంది.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. సెటప్ అంతటినీ బాగా చేసుకున్నారు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ తేలిపోయాయి కానీ మిగతా చోట్ల కాన్సెప్ట్ కి తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. సూర్య ప్రతాప్ తాడేపల్లి తెలుగు అనువాదం కూడా బాగుంది.
ఇక దర్శకుడు ఫిలిప్ కోచ్ విషయానికి వస్తే.. తాను మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు కానీ దీనిని ఇంకా కొత్తగా ఏమన్నా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. మరింత థ్రిల్లింగ్ గా చూపించే రేంజ్ తరహా కాన్సెప్ట్ ని వీక్ కథనంతో నీరుగార్చారు. సో తన వర్క్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ‘బ్రిక్’ లో మంచి ఆసక్తికరమైన నేపథ్యమే కనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని సీన్స్ ఆసక్తి రేపుతాయి. కానీ ఈ డోస్ మాత్రం ఖచ్చితంగా ఈ తరహా సర్వైవల్ థ్రిల్లర్స్ కి సరిపోదు. ఇలాంటి వాటికి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ సీన్స్ ని డిజైన్ చేసుకొని ఉంటే చూసే ఆడియెన్ కి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలం ఏర్పడుతుంది. కానీ వాటిని చాలా రెగ్యులర్ గా నడిపారు. సో ఈ థ్రిల్లర్ విషయంలో మాత్రం మోసపోకండి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team