‘మనం’ లో అతిధి పాత్ర చేయనున్న నీతు చంద్ర

‘మనం’ లో అతిధి పాత్ర చేయనున్న నీతు చంద్ర

Published on Feb 9, 2014 12:01 AM IST

manam
ఏ.యెన్ .ఆర్, నాగార్జున , నాగ చైతన్య నటించిన ‘మనం’ మార్చి 31 న భారీ విడుదలకు సిద్ధం అయింది. విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. అక్కినేని కుటుంబంలోని ముగ్గురితో పాటు ఈ చిత్రం లో శ్రియ సరన్, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రానికి సంభందించిన ఇతర వివరాలు, పాత్ర స్వభావాలు ఏమి వెలువడలేదు. ఈ చిత్ర షూటింగ్ మొదలు అయినప్పటి నుంచి, నిర్మాతలు ఈ చిత్రానికి సంభందించిన ఏ వివరాలు వెల్లడించలేదు కాని ఈ చిత్రం కథాంశం ఒక మంచి అనుభూతిని మిగుల్చుతుందని తెలుపుతున్నారు . తాజా సమాచారం ప్రకారం ‘మనం’ చిత్రం లో నీతు చంద్ర అతిధి పాత్ర పోషించింది. నీతు పాత్ర కి సంభందించిన ఏ విషయాలు తెలియనప్పటికి తను ఈ చిత్రం లో నటించానని తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. ‘మనం’ ఈ ఏడాదిలో ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం. నాగార్జున మరియు నాగ చైతన్య తో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందం గా వుంది. దర్శకులు విక్రం కుమార్ కి థాంక్స్ అని పెర్కుంది.

అనుప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏ. యెన్ . ఆర్ నటించిన ఆఖరి చిత్రం కాగా , ఈ చిత్రం విజయం తో ఆ మహానుభావుడికి ఘనం గా వీడ్కోలు పలకాలి అని అభిమానులకు నాగార్జున విజ్యప్తి చేసారు. ఈ చిత్రానికి సంభందించిన మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

తాజా వార్తలు