అఖండ 2 విడుదల కోసం బాలకృష్ణ అభిమానులు వేచిచూస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా వాయిదా పడినప్పటి నుంచి, టీమ్ నుంచి వచ్చే చిన్నచిన్న సంకేతాలు కూడా అభిమానుల్లో పెద్ద ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇక ఇదిలావుంచితే, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చే NBK111 గురించి మాత్రం వరుస అప్‌డేట్లు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న అప్‌డేట్ ఇస్తూ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని తెలిపాడు. అలాంటి ఒక చిన్న పోస్ట్‌తోనే అభిమానుల్లో కొత్తగా హైప్ మొదలైంది.
ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. నయనతార ఈ చిత్రంతో మళ్లీ బాలయ్యతో జతకట్టడం కూడా ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత వరుస అప్‌డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
