ఫిబ్రవరిలో లేడీ సూపర్ స్టార్ పెళ్లి ?

ఫిబ్రవరిలో లేడీ సూపర్ స్టార్ పెళ్లి ?

Published on Jan 2, 2021 4:58 PM IST

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉండటం, అలాగే వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుండి పెళ్లి అంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ ఫిబ్రవరిలో ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. తమిళ నాడులో ఓ చర్చిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారట.

ఏది ఏమైనా ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేసాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది. అయితే త్వరలో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారట. కాగా పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారని.. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

తాజా వార్తలు