విద్య బాలన్ కెరీర్లో ఒకానొక విజయవంతమయిన చిత్రం “కహాని” ఈ చిత్రం కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం విద్య బాలన్ పాత్రలో నయనతార నటించనున్నారు. ఈ విషయం ఇంకా అధికారికంగా దృవీకరించబడలేదు. ఈ చిత్రం హైదరాబాద్ నేపధ్యంలో సాగుతుంది. ఎండేమోల్ ఇండియా బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు.
ఈ చిత్రంలో నయనతార నటిస్తుండటం గురించి త్వరలో అధికారిక ప్రకటన చెయ్యనున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? విద్యాబాలన్ చేసిన పాత్రలో నయనతార సరిపోతుంది అంటారా? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ బాక్స్ లో రాయండి