ఖరారైన ‘నాయక్’ ఆడియో వేదిక


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాయక్’ సినిమా ఆడియో డిసెంబర్ 14న విడుదల కానుంది. ఈ ఆడియో వేడుక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు మరియు రామ్ చరణ్ కి సరిపోయేలా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అందించానని కూడా తమన్ తెలిపాడు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2013 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరన సరసన కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. 2013లో రానున్న మొదటి పెద్ద సినిమా ఇదే.

Exit mobile version