మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. నవీన్ చంద్ర, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఈమేజ్ తెచ్చుకున్న నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన సినిమా భానుమతి రామకృష్ణ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నవీన్ సరసన సలోని లూత్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఓ ఇండిపెండిట్ వెబ్ ఫిల్మ్ గా భానుమతి రామకృష్ఱ రూపొందించడం జరిగింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకుడు.