ఏటో వెళ్ళిపోయింది… రిలీజ్ డేట్ ఖరారు


చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. నాని – సమంత జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నాని కూడా తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారని ఇది వరకే తెలిపాము.

గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సమంత చాలా గ్లామరస్ గా ఉంది మరియు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా సమంతకి ఫస్ట్ బ్రేక్ వచ్చింది.

Exit mobile version