తనకు స్ఫూర్తినిచ్చిన నటున్ని కలిసిన నాని

Kamal-with-nani

టాలీవుడ్ రైజింగ్ హీరో నాని మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. నాని నటుడిగా మారడానికి ఓ పెద్ద హీరో అతనికి స్ఫూర్తి అని తెలిపాడు . ఆ పెద్ద హీరో ఎవరో కాదు మన యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్. అలా అతనికి స్ఫూర్తి నిచ్చిన కమల్ హాసన్ గారిని నాని ఈ రోజు చెన్నైలో కలిసాడు. కమల్ హాసన్ నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా షూటింగ్, నాని తమిళ్ లో చేస్తున్న బ్యాండ్ బాజా బారత్ రీమేక్ షూటింగ్ చెన్నైలో ఒకే ప్రాంతంలో జరుగుతోంది. దాంతో నాని కమల్ హసన్ గారి సెట్స్ లోకి వెళ్ళడంతో ఆయన ఎంతో సాదరంగా స్వాగతం పలికారని చెబుతున్నాడు. నాని తన ఆనందాన్ని ట్విట్టర్లో ట్వీట్స్ రూపంలో పంచుకున్నాడు.

‘ నేను ఇది వరకు చాలా సార్లు చెప్పాను.. నేను ఈ రోజు సినిమాల్లో ఉండడానికి గల కారణం, నాకు స్పూర్తినిచ్చిన నటుడు కమల్ హాసన్ సార్ ‘

‘ మా ఇద్దరి సినిమాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతోంది. కమల్ గారేమో విశ్వరూపం, నేనేమో యష్ రాజ్ ఫిల్మ్స్.. నా సెట్లో నాకు కాస్త బోర్ గా ఉండడంతో.. ఒక చిన్న పిల్లాడు తనకు బాగా ఇష్టమైన స్టార్ దగ్గర్లో ఉంటె ఎలా ఆయన్ని కలిసి ఓ ఫోటో, ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటాడో నాకు అలా అనిపించింది’.

‘ కానీ నాకే ఆశ్చర్యం కలిగే విధంగా నాకు అక్కడ సాదర స్వాగతం లబించింది. అలాగే నా గురించి తెలుసని, నా వర్క్ కూడా చూసానన్నారు. ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. ఆయన తన హీరోయిన్ కి నన్ను పరిచయం చేసారు. అలాగే తెలుగులో ముద్దుపేరుగా పిలుచుకునే నా పేరుకి తమిళ్లో ఓ డిఫరెంట్ అర్ధం వస్తుందని చెప్పారు’.

Exit mobile version