తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ దిశగా సాగుతున్నాయి. ఈ జాబితాలో నాని కూడా చేరాడు. ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా పలు హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ సినిమాకు పాన్ వరల్డ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఓ హాలీవుడ్ యాక్టర్‌ను ఇందులో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘డెడ్‌పూల్’ మూవీ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్‌ను కీలక పాత్ర కోసం ప్యారడైజ్ యూనిట్ సంప్రదించినట్టు టాక్.
మరి ఈ సినిమాలో నటించేందుకు ర్యాన్ రేనాల్డ్స్ అంగీకరించాడా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి “ది ప్యారడైజ్”తో పాన్ వరల్డ్ స్థాయిలో కొత్త ప్రయోగం చేయడానికి నాని రెడీ అవుతున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
