యంగ్ హీరో నాని రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాకి నాని డబ్బింగ్ చెబుతున్నాడని ఇది వరకే తెలిపాము. ఈ రోజుటితో నాని తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. డిసెంబర్ 14న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. సౌత్ ఇండియన్ అంద్లా భామ సమంత ఇందులో హీరోయిన్ గా నటించింది. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కంపోస్ చేసారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్లో జీవా హీరోగా నటించాడు. ఈ చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.